ఇండియా లోని ప్రజలకు భిన్న మనస్తత్వాలు , భిన్న అభిప్రాయాలు ఉండడానికి గల కారణాలు
ఇండియాలోని ప్రజలు ప్రతి విషయంలోనూ భిన్నం గా ఉంటారు .భిన్నం గా ఆలోచిస్తారు.దీనికి రక రకాల కారణాలు ఉన్నాయి.వయసు ,భాష, జాతి, కుల,మత, ప్రాంతా లు ముఖ్యంగా వీటిని నిర్దేశిస్తాయి.
ముఖ్యం గా దక్షిణ, ఉత్తర భారతదేశాలు ఈ విషయం లో ఎక్కువ భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాయి. వారి వివాహ వేడుకలలోను,ఇతర ఫంక్షన్ ల లోను మరియు పండగల లోను మనకు ఎక్కువగా ఇవి గుర్తుకు వస్తాయి.
భారత సమాజం లో ప్రజలు అనేక కులాలుగా,మతాలుగా, ప్రాంతాలుగా విడిపోయి వివిధ రకాల విలక్షణమైన ప్రాముఖ్యమైన పద్దతులను నిర్దేశించుకున్నారు. దానికి తగ్గట్లే వారి వారి అలవాట్లు , నడవడిక ముందుకు సాగింది.
తరవాత వ్యక్తుల మధ్య ధనిక , పేద అన్న తేడా మొదలుఅయ్యింది. ఉదాహరణకు ధనికులు కుర్చీలో కూర్చుని దర్జా గా బతుకుతుంటే పేద వారు వారి ముందు చేతులు కట్టుకుని బ్రతిమాడాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కొన్ని కొన్ని పల్లెటూళ్లలో ఇప్పటికి ఆ పరిస్థితిని చూడవచ్చు.
స్త్రీ , పురుష మధ్య తారతమ్యాలు కూడా ఇండియా లో ఎక్కువే.అనాది నుండి మగ వారే ఎక్కువగా ల్యాండ్ డీలింగ్ గాని, బిజినెస్ ను గాని నడిపించడం సంప్రదాయంగా మారింది. స్త్రీ పరదా చాటు నుండి బయటకు రావడానికి చాలా కాలమే పట్టింది.
సోషల్ ఇన్ ఈక్వాలిటీ అనేది ప్రపంచ వ్యాప్తం గా ఉంది, కానీ భారత దేశం లో ఇది కుల, వర్ణ, మతా లు గా విడిపోయి మరింత గా వ్యాప్తి చెందింది .భారత దేశం లో మతం అనేది వేల సంఖ్యలో చిన్న చిన్న కులాలు, వర్ణాలుగా విడిపోయింది. విభిన్న కులాల వారు వారి కుల సంప్రదాయాలను పాటిస్తూ ఉండడం వాళ్ళ వారి వారి అలవాట్లు కూడా మిగతా వారికీ బిన్నం గా ఉండ సాగింది .పట్నాలలో కన్నా పల్లెటూళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.
ఇండియా లోని ఇటువంటి భిన్నమైన సంప్రదాయాలు భిన్నమైన మనస్తత్వాలు,ప్రపంచానికి ఇండియా యొక్క ప్రజాస్వామ్య విలువలని చాటి చెప్పాయి..గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా ప్రజలు వారివారి సంప్రదాయాలను మెరుగు పరుచుకుని ,విభిన్న వ్యక్తిత్వాలను బలపర్చుకుని ,ఎవరి అభిప్రాయాలకు తగ్గట్లు వారు గౌరవప్రదమైన సమాజాలను నిర్మిస్తున్నారు.ఇది కచ్చితంగా ఇండియాకు బలం గా మరి కొత్తకొత్త సవాళ్ళను అధిగమిస్తుంది అనుకుంటున్నాను
OnePlus Nord CE 2 Lite 5G (Blue Tide, 6GB RAM, 128GB Storage)
Comments
Post a Comment